Friday, April 4, 2008

వెబ్ సైట్ లో అన్నదానం గురించి తెలుసా !.......


ఆకలి చావుకన్నా భయంకరమైంది ఈ భూమి మీద లేదు. అలాంటి వాళ్ళకు కనీసం గంజినీళ్ళందించాలన్న ప్రయత్నంతో అనేక ప్రఖ్యాత కంపెనీల సహకారంతో చేపట్టిన ఒక వినూత్నమైన కార్యక్రమము ఇది. ఎంతో తమాషాగా ఉంటుంది ఈ సైట్ యొక్క థీమ్. ఒక ఆంగ్ల పదానికి అక్కడ ఇచ్చిన నాలుగు సమాధానాలలో సరయినది మీరు కనిపెడితే చాలు, మీ బదులు "IBM" లాంటి కంపెనీలు 20 బియ్యపు గింజలను ఐక్యరాజ్యసమితికి డొనేట్ చేస్తాయి. మీరెన్ని కరక్ట్ గా చెబితే అంతమంది కడుపులు నింపవచ్చన్నమాట. దీన్ని నేరుగా ఆడచ్చు, ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మరొక విషయం..మీ English Skills కూడా పెంచుకోవచ్చు.




No comments: